తేల్చుకో.. సైన్యమా.. సోషల్‌ మీడియానా..? 
close

తాజా వార్తలు

Updated : 15/07/2020 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తేల్చుకో.. సైన్యమా.. సోషల్‌ మీడియానా..? 

దిల్లీ: భారత సైన్యంలో సోషల్‌ మీడియా యాప్‌లను డిలీట్‌ చేయాలనే ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ అధికారికి చుక్కెదురైంది. నిన్న ఈ కేసు విచారణ సందర్భంగా దిల్లీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘‘సైన్యం సోషల్‌ మీడియా బ్యాన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఫేస్‌బుక్‌ ఖాతాను డిలీట్‌ చేయాలి. ఒక సైనిక అధికారిగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. సైన్యం నుంచి వైదొలగిన తర్వాత మరో కొత్త ఖాతాను ఫేస్‌బుక్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఇప్పటి ఖాతాలానే పనిచేస్తుంది. దేశ భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్న సమయంలో మినహాయింపులు ఇచ్చే ప్రశ్నే తలెత్తదు’’ అని జస్టిస్‌ రాజీవ్‌ సహాయ్‌, ఆశా మేనన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసు దాఖలు చేసిన లెఫ్టినెంట్‌ కర్నల్‌ పీకే చౌదరీ దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఫేస్‌బుక్‌ ఖాతాను డిలిట్‌ చేస్తే డేటా, ఫ్రెండ్స్‌, కంటెంట్‌ను శాశ్వతంగా కోల్పోతాను. ఈ నష్టం పూడ్చలేనిది’’ అని న్యాయస్థానానికి తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ..‘‘ మీకు కొత్తగా ఏర్పాటు చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దానిని గతంలో వలే వాడుకోవచ్చు. మీరు ఒక కీలక సంస్థలో భాగం. ఆ సంస్థ చెప్పినట్లు నడచుకోవాలి. మీకు ఫేస్‌బుక్‌ మరీ అంత ఇష్టమైతే ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు. మీరు ఈ రెండిటిలో ఒకటి ఎంచుకోవచ్చు’’ అని పేర్కొంది. 

మరోపక్క కేంద్రం తరపున అదనపు సోలిసిటర్‌జనరల్‌ చేతన్‌ శర్మ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. ‘‘ఫేస్‌బుక్‌లో ఒక బగ్‌ను కనుగొన్నాము. అది సైబర్‌ యుద్ధంలో వినియోగించేదాని వలే పనిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది సైన్యం ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొన్నట్లు గుర్తించాము’’ అని చెప్పారు. దీనిపై సైన్యం పాలసీని పరిశీలించిన అనంతరం తీర్పును ఈ నెల 21 నాటికి వాయిదా వేస్తున్నట్టు  ధర్మాసనం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని