close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ‘దిశ’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

మహిళా భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం జగన్‌ బిల్లుకు తీసుకురావడానికి గల కారణాలను వివరించారు. మహిళలు, చిన్నారులపై దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని.. వీటిని నివారించాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని చెప్పారు. అనంతరం ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు. గవర్నర్‌ ఆమోదం తర్వాత ‘దిశ’ బిల్లు చట్టంగా మారనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఒక్కరి ఖాతాలోనైనా రూ.5లక్షలు పడ్డాయా?

రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సంవత్సరం దాటిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. ‘రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కరి ఖాతాలోనైనా రూ.5 లక్షలు వేశారా? రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తున్నారు’ అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘దిశ’లాంటి ఘటనలతో గుండె తరుక్కుపోతోంది!

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రవేశ పెట్టిన ‘దిశ’ బిల్లుపై చర్చ సందర్భంగా భవానీ మాట్లాడారు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుండేవారని గుర్తు చేశారు. కానీ సమాజంలో తిరుగుతున్న కొందరు మృగాళ్ల వల్ల ఇలాంటి పెద్దల మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దు

ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగులు వేయడంపై పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.  దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయవద్దని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జమ్మూకశ్మీర్‌ జైళ్లలో మైనర్లు లేరు: సుప్రీంకోర్టు

ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది మైనర్లను అదుపులోకి తీసుకొని జైళ్లలో పెట్టారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై జమ్మూకశ్మీర్‌ హైకోర్టు జువినైల్‌ జస్టిస్‌ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో మైనర్లను అదుపులోకి తీసుకున్నారంటూ ఇనాక్షీ గంగూలీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపాయేతర సీఎంలకు ప్రశాంత్‌ కిశోర్‌ సూచన..!

‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 2019’(క్యాబ్‌)ని తొలి నుంచి తీవ్రంగా విమర్శిస్తున్న ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని అమలుకు అడ్డుకొని ‘భారత ఆత్మ’ను కాపాడాలని వ్యాఖ్యానించారు. ‘‘పార్లమెంటులో మెజారిటీయే గెలిచింది. న్యాయవ్యవస్థను దాటి వెళ్లిపోయింది. ఇక ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన 16 మంది భాజపాయేతర ముఖ్యమంత్రులపైనే భారత ఆత్మను కాపాడాల్సిన బాధ్యత ఉంది. పంజాబ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇప్పటికే ‘క్యాబ్‌’, ఎన్‌ఆర్‌సీకి నో చెప్పారు. ఇతరులు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’

అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ లోక్‌సభలో భాజపా మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు. అయితే తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్‌ అన్నారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘నేను క్షమాపణలు చెప్పను. అసలు నేను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో స్పష్టంగా చెబుతాను. ప్రధాని మోదీ పదేపదే మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడుతారు. కానీ వార్తాపత్రికలు చూసినప్పుడు మాత్రం మేకిన్‌ ఇండియా కంటే ఎక్కువగా అత్యాచార వార్తలే కన్పిస్తున్నాయి’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉత్తర భారతాన్ని కప్పేసిన మంచు దుప్పటి

9. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలన్న పిటిషన్‌పై విచారణను దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో దోషిగా ఉన్న అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ ఈ నెల 18న చేపడతామని స్పష్టం చేసింది. మరోవైపు నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చాలని అనుమతి కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విజయవాడలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.