close
Array ( ) 1

తాజా వార్తలు

ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది: గోపీచంద్‌

అథ్లెట్లు, సహాయక సిబ్బంది ఒత్తిడిగా ఉండేది

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం చాలా మంచి నిర్ణయమని భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సమాఖ్య(ఐఓసీ) తీసుకున్న వాయిదా నిర్ణయం చాలా మంచిది. ఇలాంటి సమయంలో క్రీడల గురించి ఆలోచించడం ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి ఒత్తిడిగా ఉంటుంది. ఈ నిర్ణయం సరైనదే. ఐఓసీ చాలా మంచి పనిచేసింది. ఈ నిర్ణయం తీసుకోడంలో వారం, పది రోజులు ఆలస్యమైనా, చివరికి సరైన సమయంలో స్పందించింది’ అని గోపీచంద్‌ అన్నారు.

ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేయడంతో ఆటగాళ్లకు మంచి సమయం దొరికిందని, ప్రస్తుత గందరగోళ్ల పరిస్థితుల్లో సాధన చేయని వారికి ఇదొక అవకాశమని చెప్పారు. ఒకవేళ నెల, రెండు నెలలు వాయిదా పడినా అది ఆందోళన కలిగించేదన్నారు. ఏకంగా ఏదాది పాటు వాయిదాపడడంతో అథ్లెట్లకు సరైన సమయం దొరికిందన్నారు. మరోవైపు బ్యాడ్మింటన్‌ విభాగంలో ఒలింపిక్స్‌ అర్హతపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్‌.. ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా పేర్కొంది. కాగా, అంతకుముందు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరగాల్సిన అన్ని టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  

ఈ విషయంపై స్పందించిన గోపీచంద్‌ ఒలింపిక్స్‌ అర్హత అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా చర్చనీయాంశంగా మారుతుందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది సమయం ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని గోపిచంద్‌ సూచించారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధించి రద్దైన ఆరు టోర్నీలను మళ్లీ నిర్వహించాలని కోరారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.