close

తాజా వార్తలు

Published : 17/11/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతను 45 నిమిషాల పాటు చనిపోయాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదంలో చిక్కుకుని ఆరగంటకు పైగా అగిపోయిన ఓ పర్వతారోహకుడి గుండె మళ్లీ కొట్టుకుంది. మైకేల్‌ నాపిన్కీ అనే 45 ఏళ్ల అమెరికన్‌..  నవంబర్‌ 7 ఉదయం తన స్నేహితుడితో కలసి స్కీయింగ్ చేసేందుకు అమెరికాలోని మౌంట్‌ రెయినైర్‌ నేషనల్ పార్క్‌కు వెళ్లాడు. ఇంకాసేపట్లో ముగుస్తుందనగా వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రత -8.9 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయింది. భారీగా మంచు కురవటంతో ఏమీ కనిపించలేదని మైకేల్‌ తెలిపాడు. దిగేందుకు అతి కష్టంగా ప్రయత్నించటమే తనకు గుర్తుందని ఆ తరవాతేం జరిగిందో తెలీదన్నాడు.

మైకేల్‌  కనబడటం లేదన్న స్నేహితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మూడు అన్వేషణ బృందాలు.. చివరికి అతన్ని కనిపెట్టాయి.హెలికాఫ్టర్‌ ద్వారా అతన్ని హార్బర్‌ వ్యూ మెడికల్‌ సెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కొన ఊపిరితో ఉన్న మైకేల్‌ గుండె 45 నిమిషాల పాటు కొట్టుకోవటం ఆగిపోయింది. దానిని తిరిగి పనిచేయించేందుకు వైద్యులు పలు రకాలుగా ప్రయత్నించారు. వీరి కృషి ఫలించి మళ్లీ చలనం వచ్చింది. అంటే చనిపోయిన మైకేల్‌ 45 నిమిషాల తర్వాత మళ్లీ బతికాడు.

మైకేల్‌ నాపిన్కీ కేసు ద్వారా కృత్రిమ పద్ధతుల్లో ప్రాణాన్ని నిలబట్టే ఓ అత్యాధునిక విధానాన్ని పరీక్షించే అరుదైన అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ఇందేలో భాగంగా బాధితుడి గుండె, ఊపిరితిత్తులను తప్పించి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేశామన్నారు.గుండె, ఊపిరితిత్తుల్లో కాస్త సమస్య ఉన్నప్పటికీ.. మైకేల్‌  క్షేమంగానే ఉన్నట్టు ప్రకటించారు. రెండు రోజుల అనంతరం ఆయన  స్పృహలోకి వచ్చాడు. ప్రాణం పోయినా నిరాశ చెందకుండా తన తరపున పోరాడిన ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాక.. ప్రజలకు సహాయం చేయటమే తన లక్ష్యమన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని