close

తాజా వార్తలు

Published : 01/10/2020 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేయ్యండిలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అనుకోకుండా వేరే ఊరికి బయల్దేరాం. ఇంతలో ఫోన్‌ బ్యాటరీ డౌన్‌ అయింది. ఛార్జింగ్ పెట్టుకునే టైం లేదు. కానీ ఫోన్‌తో చాలా అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ముందుగా మనకు గుర్తొచ్చేది పవర్‌ బ్యాంక్. ఫోన్‌ సైజులో ఉండే ఈ గ్యాడ్జెట్‌ను ముందుగా ఛార్జ్‌ చేసుకుంటే అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. 2020లో వచ్చే అన్ని ఫోన్స్‌లో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఇస్తున్నారు. అయినప్పటికీ  ఫోన్‌ వినియోగం పెరిగిపోవడంతో ఫోన్‌ను విడిచిపెట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఫోన్లో పనిచేస్తూనే ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునేలా సౌకర్యంగా ఉండటంతో మార్కెట్లో పవర్‌ బ్యాంక్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి మార్కెట్లో వివిధ రకాల పవర్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ధర, సామర్థ్యం, బ్రాండ్ ఆధారంగా కొన్ని ఉత్తమమైన వాటి వివరాలు మీ కోసం..


షావోమి ఎంఐ పవర్‌ బ్యాంక్స్‌

షావోమి 2ఐ, 3ఐ వేరియంట్లో పవర్‌ బ్యాంక్‌లను అందిస్తుంది. వీటిలో 10,000 ఎంఏహెచ్‌, 20,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్స్‌ ఉన్నాయి. వాటితో పాటు 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. 2వే ఫాస్ట్ ఛార్జింగ్‌, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ టైప్‌-సీ, మైక్రో-యుఎస్‌బీ పోర్ట్‌, లోపవర్‌ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 10,000 ఎంఏహెచ్‌ వేరియంట్ ప్రారంభ ధర రూ. 899. 20,000 ఎంఏహెచ్‌ ప్రారంభ ధర రూ. 1,499. 10,000 ఎంఏహెచ్‌ వైర్‌లెస్ వేరియంట్ ధర రూ.1,399. 20,000 ఎంఏహెచ్ వైర్‌లెస్‌ ధర రూ. 2,499. అలానే 10,000 ఎంఏహెచ్‌ పూర్తి ఛార్జింగ్‌కు నాలుగు గంటల సమయం పడితే 20,000 పూర్తి ఛార్జింగ్‌కు ఏడు గంటలు పడుతుంది.


రియల్‌మీ పవర్‌ బ్యాంక్స్‌

రియల్‌మీ మూడు వేరియంట్లో 10,000 ఎంఏహెచ్ పవర్‌ బ్యాంక్స్‌ను ఆఫర్ చేస్తుంది. పవర్‌ బ్యాంక్‌, పవర్‌ బ్యాంక్ 2, 30 వాట్  డార్ట్ ఛార్జ్‌  పేరుతో ఇవి లభిస్తున్నాయి. వీటిలో మొదటి రెండు పవర్ బ్యాంక్‌లు 18 వాట్ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. ఒకే సారి రెండు డివైజ్‌లను చార్జ్‌ చేసుకోవచ్చు. యుఎస్‌బీ-ఏ, యుస్‌బీ-సీ పోర్ట్స్‌ ఉన్నాయి. పవర్‌ బ్యాంక్‌ వేరియంట్ చార్జ్‌ అవటానికి ఐదున్నర గంటలు పడితే, పవర్‌ బ్యాంక్‌ 2 పూర్తి బ్యాటరీ ఛార్జ్‌ అయ్యేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇక 30 వాట్ డార్ట్ చార్జ్‌ వేరియంట్ పూర్తిగా చార్జ్‌ అయ్యేందుకు కేవలం గంటన్నర సమయం పడుతుంది. 30 వాట్ 2-వే డార్ట్ ఛార్జింగ్, 15 లేయర్‌ ఛార్జింగ్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పవర్‌ బ్యాంక్‌ ధర రూ. 1,299, పవర్‌ బ్యాంక్‌ 2 ధర రూ. 999. 30 వాట్ డాట్ చార్జ్‌ ధర రూ. 1,999.  


అంబ్రేన్ పీపీ-150

15,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో ఇది పనిచేస్తుంది. డ్యూయల్‌ యుఎస్‌బీ పోర్ట్స్‌, టైప్‌సీ పోర్ట్, మైక్రో యుఎస్‌బీ పోర్ట్స్‌ ఉన్నాయి. 9 లేయర్‌ ప్రొటెక్షన్‌తో హై క్వాలిటీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్‌ అయ్యేందుకు పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. పీపీ-150 మోడల్‌తో పాటు అంబ్రేన్‌ 5,000 ఎంఏహెచ్, 10,000 ఎంఏహెచ్‌, 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్లను కూడా అందిస్తుంది. ఇక ధర విషయానికొస్తే అంబ్రేన్‌ పవర్‌ బ్యాంక్‌లు రూ.599 నుంచి రూ.1699 వరకు అందుబాటులో ఉన్నాయి.


శాంసంగ్‌ ఈబీ-పీ1100

శాంసంగ్ 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో ఈబీ-పీ1100 మోడల్‌ పవర్‌ బ్యాంక్‌ని అందిస్తుంది. అడాప్టివ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌తో మూడున్నర గంటలు ఫాస్ట్ ఛార్జింగ్, నాలుగున్నర గంటలు సాధారణ చార్జింగ్  చేసుకునే సదుపాయం ఉంది. రెండు యుఎస్‌బీ ఫోర్ట్‌లను ఇస్తున్నారు. దీని ధర రూ. 1,499.


అంబ్రేన్‌ క్యాప్సుల్ 10K

9 లేయర్‌ చిప్‌సెట్ ప్రొటెక్షన్‌తో అంబ్రేన్‌ క్యాప్సుల్ పవర్ బ్యాంక్‌ను రూపొందించారు. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇస్తున్నారు. ఇందులో రెండు యుఎస్‌బీ, ఒక మైక్రో యుఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేందుకు ఐదు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. క్యాప్సుల్ ప్రారంభ ధర రూ. 699. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 599.


సిస్కా పవర్‌ బ్యాంక్స్‌

సిస్కా 8,000 ఎంఏహెచ్‌ నుంచి 20,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వివిధ మోడల్స్‌ పవర్‌ బ్యాంక్‌లను విక్రయిస్తుంది. వీటిలో రెండు యుఎస్‌బీ, ఒక మైక్రో యుఎస్‌బీ, యుఎస్‌బీ-సీ పోర్ట్‌లను ఇస్తున్నారు. కొన్ని మోడల్స్‌లో బ్యాటరీ ఎంత శాతం ఛార్జింగ్ ఉంది అనేది డిస్‌ప్లేలో చూసిస్తుంది. సిస్కా పవర్‌ బ్యాంక్స్‌ రూ. 799 ధర నుంచి రూ. 2,399 వరకు అందుబాటులో ఉన్నాయి.


ఫిలిప్స్‌ పవర్‌ బ్యాంక్‌

ఐదు వేరియంట్లలో ఫిలిప్స్‌ పవర్‌ బ్యాంక్‌లను అందిస్తుంది. 10,000 ఎంఏహెచ్‌, 20,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు యుఎస్‌బీ పోర్ట్‌లతో పాటు యుఎస్‌బీ ఏ, యుఎస్‌బీ-సీ పోర్ట్‌లను ఇస్తున్నారు. 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేందుకు ఏడు గంటల సమయం పడుతుంది. వీటి ప్రారంభ ధర రూ. 1,199.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.