భారత్‌లో 24 గంటల్లో 2,293 కేసులు
close

తాజా వార్తలు

Updated : 02/05/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 24 గంటల్లో 2,293 కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,293 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 37,336కు పెరిగింది. ఇక కొత్తగా 71 మందిని మహమ్మారి బలిగొనడంతో దేశంలో మృతుల సంఖ్య 1,218కి చేరింది. ఇప్పటి వరకు 9,951 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 11,506కు చేరింది. వీరిలో 485 మంది మృత్యువాతపడగా.. 1,879 మంది కోలుకున్నారు. ఇక తర్వాత గుజరాత్‌లో 4,721 కేసులు నమోదవ్వగా.. 236 మంది మృతిచెందారు. 735 మంది డిశ్చార్జి అయ్యారు.     

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకుగాను విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదివరకు విధించిన లాక్‌డౌన్‌ గడువు ఆదివారంతో ముగిసిపోనుండగా.. తాజా పొడిగింపు నేపథ్యంలో అది ఈ నెల 17 వరకు అమల్లో ఉండనుంది. అయితే- కరోనా తీవ్రత ఆధారంగా వర్గీకరించిన రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో పలు పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం తాజాగా అనుమతులు ఇచ్చింది. గ్రీన్‌ జోన్లలోని జిల్లాల్లో అంతర్గతంగా బస్సులను నడిపించేందుకు పచ్చజెండా ఊపింది. ఏ జోన్‌లోనైనాసరే కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాలకూ అనుమతి ఉండదు. దేశంలోని 733 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా వర్గీకరిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

ఇవీ చదవండి..

జోన్ల వారీగా లాక్‌డౌన్‌ మినహాయింపులివే..

కొవిడ్‌-19 చికిత్సకు మరో ఔషధం!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని