జగన్‌ అక్రమాస్తుల కేసు.. రేపటికి వాయిదా
close

తాజా వార్తలు

Published : 27/10/2020 17:34 IST

జగన్‌ అక్రమాస్తుల కేసు.. రేపటికి వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీబీఐ ఛార్జ్‌షీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై ఏసీబీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని.. నిందితుల ప్రమేయంపై ఆధారాలున్నాయని వాదించారు. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని