మందలించడమే ఆ తల్లికి శాపమైంది..
close

తాజా వార్తలు

Published : 02/08/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందలించడమే ఆ తల్లికి శాపమైంది..

 

బెంగళూరు: అర్ధరాత్రి వరకు స్నేహితులతో కలిసి తిరగొద్దని మందలించడమే ఆ తల్లికి శాపమైంది. తనను మందలించిందనే కోపంతో కుమారుడు ఆ తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని మండ్య పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాలలో చదివే కుమారుడు తరచూ స్నేహితులతో గడుపుతూ అర్ధరాత్రి వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ విషయం నచ్చని తల్లి కుమారుడిని పలుమార్లు మందలించింది. గత బుధవారం సైతం ఇదే విషయంలో వారిరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు తన తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని జులై 30న అరెస్టు చేసినట్లు పోలీసు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని