ఉద్యోగుల కోసం మారుతీ కొత్త ఆఫర్‌!
close

తాజా వార్తలు

Updated : 18/10/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగుల కోసం మారుతీ కొత్త ఆఫర్‌!

దిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంగా ఉద్యోగులకు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఈ పండగ సీజన్‌లో మారుతీ కార్ల కొనుగోలుపై వారికి రూ.11 వేలకు వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు.. పోలీసు, పారామిలటరీ సిబ్బంది కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను అందిస్తామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టిందని, తమవంతు బాధ్యతగా వీటిని అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  (మార్కెట్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సుమారు కోటి మంది పనిచేస్తున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు శశాంక్‌ తెలిపారు. దీని ద్వారా తమకు ఇష్టమైన కార్లను ఇంటికి తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌టీసీ ఎన్‌క్యాష్‌మెంట్‌ బెన్‌ఫిట్‌కు అదనంగా ఈ సదుపాయం పొందొచ్చని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌తో సుమారు 45 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని కంపెనీ పేర్కొంది.. ఈ స్కీమ్‌ వల్ల 2021 మార్చి 31 నాటికి అదనంగా రూ.28వేల కోట్ల మేర డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆల్టో, సెలేరియో, ఎస్‌-ప్రెస్సో, వ్యాగన్‌-ఆర్‌, ఈకో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఇగ్నిస్‌, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, సియాజ్‌, ఎస్‌-క్రాస్‌ వంటి మోడళ్ల కొనుగోలుపై ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని