close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్కో వలస కార్మికుడికి రూ.10వేలు ఇవ్వండి

కోల్‌కతా: లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తక్షణం ఆదుకోవాలంటే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లో  రూ.10వేలు చొప్పున జమ చేయాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్విట్టర్‌లో ‘‘ప్రస్తుతం కరోనా సంక్షోభంతో సాధారణ ప్రజల జీవితాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు మెరుగవ్వాలంటే తక్షణమే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు చొప్పున జమ చేయాల్సిందిగా కోరుతున్నా. ‘పీఎమ్‌ కేర్స్‌’ నిధికి వచ్చిన విరాళాల్ని ఇందుకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది’’ అంటూ రాసుకొచ్చారు.

ఇటీవల సంభవించిన అంపన్‌ తుపాను‌ కారణంగా నష్టపోయిన ఒక్కో కుటుంబానికి మమతా ప్రభుత్వం రూ.20వేలు చొప్పున నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తర్వాత రోజే ఆమె కేంద్రాన్ని ఈ విధంగా డిమాండ్‌ చేయడం గమనార్హం. కష్ట సమయాల్లో బెంగాల్‌ ప్రజలను ఆదుకోవడం ద్వారా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్‌ సిన్హా స్పందిస్తూ.. బెంగాల్‌ ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో బెంగాల్‌ వలస కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాన్ని కప్పిపుచ్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని రోజుల క్రితం శ్రామిక్‌ రైళ్ల ద్వారా వలసకార్మికులను తరలిస్తున్న సమయంలో కేంద్రానికి, మమతాబెనర్జీకి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది పశ్చిమబెంగాల్‌ వలస కార్మికులు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల ద్వారా వారి, వారి స్వస్థలాలకు చేరుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.