close

తాజా వార్తలు

Published : 21/05/2020 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ, తెలంగాణ జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం పంపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా, గోదావరి జలాల అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్‌శక్తి శాఖ అండర్ సెక్రటరీ ఎ.సి. మల్లిక్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కోరింది.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన