close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్‌

ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. కేంద్రం నిధులపై శాఖలవారీగా మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్‌లో కన్నీళ్లు అన్నట్టుగా కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్‌ వ్యాఖ్యల్లో వాస్తవంలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజధాని రైతులకు త్వరలో తీపికబురు: బుగ్గన

రాజధాని ప్రాంత రైతులకు త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో అమరావతి ప్రాంత అసైన్డ్‌ భూముల రైతులు నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తమను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుందని మంత్రి వివరించారు. అప్పటి పాలకులు వేల ఎకరాలు అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. ‘దిశ’ కేసు దర్యాప్తు వేగవంతం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు ఆధారాలు సమర్పించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్వయంగా ఈకేసును పర్యవేక్షిస్తున్నారు. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో .. నాలుగు ప్రత్యేక బృందాలు కీలక ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యాయి. దర్యాప్తు బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. క్లూస్‌టీమ్‌, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక, నిందితుల విచారణకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఒక్కో దర్యాప్తు బృందం పర్యవేక్షించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలపైనే ఉత్కంఠ!

కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సాయంత్రం 5గంటల సమయానికి మొత్తం 60శాతం పోలింగ్‌ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫలితాలు డిసెంబర్‌ 9న వెలువడనున్నాయి. ప్రభుత్వ మనుగడకే కీలకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బస్సుల్లో ఇక సీసీటీవీలు, పానిక్‌ బటన్లు!

మహిళల భద్రతే లక్ష్యంగా దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో తిరిగే బస్సుల్లో సీసీ టీవీలు, పానిక్‌ బటన్స్‌, జీపీఎస్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ), క్లస్టర్లకు చెందిన మొత్తం 5500 బస్సుల్లో వీటిని అమర్చనున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ గురువారం వెల్లడించారు. ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు, 10 పానిక్‌ బటన్లు, జీపీఎస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు బస్సులో ఉండే ఈ పానిక్‌ బటన్స్‌ నొక్కితే అక్కడి సమాచారం కమాండ్‌ సెంటర్‌తో పాటు అనుసంధానించిన పలు వ్యవస్థలకు చేరడంతో పోలీసులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిలిచిపోతున్న కశ్మీరీల వాట్సప్‌ ఖాతాలు

కశ్మీరీలకు చెందిన వాట్సప్‌ ఖాతాలు నిలిచిపోతున్నాయి. నాలుగు నెలలుగా ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో వారంతా ఇన్నాళ్లూ వాట్సప్‌కు దూరంగా ఉన్నారు. నిబంధనల ప్రకారం 120 రోజుల పాటు ఖాతాలు ఇన్‌యాక్టివ్‌లో ఉంటే ఆ ఖాతాలు తొలగిస్తారు. దీంతో ఆయా ఖాతాలు వాట్సప్‌ గ్రూప్‌ నుంచి ఆటోమేటిక్‌గా ఎగ్జిట్‌ కావడం కొందరు గుర్తించారు. ఎందుకిలా జరుగుతోందో తెలీక సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై వాట్సప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. కంపెనీ నిబంధనల వల్లే వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి వ్యక్తుల ఖాతాలు ఎగ్జిట్‌ అవుతున్నట్టు  తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు

విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకొన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. డిసెంబర్‌ 3నాటికి ఇవి 451.7 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆయన గురువారం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 38.8 బిలియన్‌ డాలర్లను అదనంగా సమకూర్చుకొన్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికమన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను చివరిసారి నవంబర్‌ 22న ప్రకటించారు. అప్పట్లో 347 మిలియన్‌ డాలర్లు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పంత్‌నుఒంటరి చేయొద్దు: విరాట్‌

యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌కు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. అతడికి అందరూ మద్దతుగా ఉండాలని కోరాడు. ఒంటరితనంతో బాధపడేలా చేయొద్దని సూచించాడు. ప్రస్తుతం పంత్‌ తన సామర్థ్యం మేరకు కీపింగ్‌, బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. విమర్శలకు గురవుతున్నాడు. ‘రిషభ్‌ సామర్థ్యంపై మాకు విశ్వాసం ఉంది. మీరన్నట్టు బాగా ఆడటం, కష్టపడటం ఆటగాడి బాధ్యత. దాంతో నేనూ ఏకీభవిస్తా. ఆ ఆటగాడు బాగా ఆడేలా వాతావరణం సృష్టించడం మనందరి సమష్టి బాధ్యత. అతడొక పొరపాటు చేస్తే అరవొద్దు. అది గౌరవించినట్టు కాదు’ అని కోహ్లీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నందిగామ వద్ద ప్రమాదం: నలుగురి మృతి

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద  గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రధాన రహదారిపై ఆగివున్న డీసీఎం వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జంగారెడ్డిగూడెంలో సందడి చేసిన నటి రష్మి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.