close

తాజా వార్తలు

Updated : 21/09/2020 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఓపెన్‌ నాలాలపై క్యాపింగ్‌ నిర్మాణం: కేటీఆర్‌

నగరంలోని ఓపెన్‌ నాలాలపై క్యాపింగ్‌ (బాక్స్‌ డ్రైనేజీలు) నిర్మాణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేయాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. క్యాపింగ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.300కోట్లు ఖర్చు అవుతాయని.. వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కొవిడ్‌పై పోరు.. స్వాబ్‌ టెస్ట్‌లకు రోబో!

ప్రపంచ దేశాలను కరోనా భయం వెంటాడుతోంది. లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందినీ వదలడంలేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది. ఇకపై ‘స్వాబోట్‌’ తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. హైదరాబాద్‌ vs బెంగళూరు

యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ జట్టు కోహ్లీ సారథ్యంలోని బెంగుళూరుతో తలపడుతోంది. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి. 

4. కొడాలిపై పోలీసులకు సోము వీర్రాజు ఫిర్యాదు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సీనియర్‌ నటి సీత కన్నుమూత

సీనియర్‌ నటి సీత (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. సీత మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1940లో సీత నటిగా సినీ కెరీర్‌ ఆరంభించారు. ‘దేవదాసు’, ‘మాయా బజార్‌’లాంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. దాదాపు 200లకు పైగా చిత్రాల్లో కనిపించి, అలరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆరు రబీ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం!

రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమపై కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో వెల్లడించారు. మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు సీసీఈఏ ఆమోదించిందని తోమర్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మొదట డిజిటల్ మీడియాను నియంత్రించాలి

డిజిటల్ మీడియా విషపూరిత విద్వేషాన్ని, ఉగ్రవాదం, హింసను ‘ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తోంది’ అంటూ కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే  మొదట వెబ్ ఆధారిత మీడియాను కోర్టు నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలంటూ కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సీతారాం ఏచూరిని కలిసిన మహిళా రైతులు

అమరావతి మహిళా ఐకాస నేతలు, మహిళా రైతులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. రాజధాని అమరావతి అంశంతో పాటు, ఆందోళనచేస్తున్న మహిళలపై పోలీసుల దాడుల గురించి ఆయనకు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐకాస నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. మూడు రాజధానులు అనేవి వాస్తవంగా సాధ్యం కాదని ఏచూరి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 56,569 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,235 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 51,60,700 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,31,749 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘ఆ విషయం తెలియక తలసాని ఛాలెంజ్‌ చేశారు’

జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారని...కానీ తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో కాగితాలపై ఉన్న లెక్కలు.. క్షేత్రస్థాయిలో చూపించడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మాట్లాడారు. లక్ష ఇళ్లు కట్టలేదనే విషయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియక తనతో ఛాలెంజ్‌ చేశారని భట్టి ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.