close

తాజా వార్తలు

Published : 28/09/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. వచ్చేనెల తొలివారంలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ

అక్టోబర్‌ తొలివారంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ భేటీకి సిద్ధం కావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయం సమాచారం పంపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జలవివాదాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రైల్వే యూజర్‌ ఛార్జీల బాదుడు ఇలా!

విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వే ప్రయాణికులు కూడా యూజర్‌ ఛార్జీలు చెల్లించే సమయం ఆసన్నమైంది. టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేయగా.. త్వరలో కేబినెట్‌ ఆమోదానికి పంపనుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్‌ ధరకు అదనంగా యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘టీపీసీసీ అధ్యక్షుడి మార్పు నా పరిధిలో లేదు’

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి 2023 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అన్నారు. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే కాంగ్రెస్‌దే గెలుపు అని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి మార్పు విషయం తన పరిధిలో లేదని.. ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాణికం ఠాగూర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికకు మండలాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కరోనాకు ఆయుర్వేదం ఔషధం: సంచలన ఫలితాలు

కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బెంగళూరు vs ముంబయి

ఐపీఎల్ పదో లీగ్ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. దుబాయ్‌ వేదికగా బెంగళూరు, ముంబయి జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ ఆరోన్‌ ఫించ్ (52) అర్ధ శతకం బాదాడు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

6. ‘మీరే రండి.. లేదా పవారే ఎన్డీయేతో కలుస్తారు’

మహారాష్ట్రలో భాజపాతో మళ్లీ శివసేన ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి, ఆర్‌పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్‌ అథవాలే అన్నారు. అధికారం పంచుకొనే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఏడాది పాటు సీఎంగా ఉండాలని,  ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆ పదవిలోకి భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉంటారని సూచించారు. ఒకవేళ భాజపాతో శివసేన బంధం ఏర్పరచుకొనేందుకు ముందుకు రాకపోతే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఎన్డీయేతో కలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 66,121 నమూనాలను పరీక్షించగా 5,487 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 7,210 మంది కరోనా నుంచి కోలుకోగా.. చికిత్స పొందుతూ 37 మంది మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం

దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేన చీఫ్‌ బదౌరియా, నావికాదళాధిపతి కరమ్‌బీర్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలు ఆయుధాల కొనుగోలు విధానాలను మరింత సులభతరం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హేమంత్‌ హత్య.. 21కి చేరిన నిందితులు!

సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు మరో ముగ్గురిని విచారిస్తున్నారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే 14 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా కృష్ణ, బాషా, జగన్‌, సయ్యద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హేమంత్‌ భార్య అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి, సందీప్‌తోపాటు మరో వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఇది ధోనీ 2.0.. కాస్త టైం పడుతుంది: దాదా 

యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌లో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్న చెన్నై సారథి ఎంఎస్ ధోనీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. ఏడాదిన్నర తర్వాత బ్యాట్‌ పట్టిన అతడు పూర్వపు ఫామ్‌ను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందని అన్నాడు. ‘‘ధోనీ తన పూర్వపు సూపర్‌ ఫామ్‌ను పొందడానికి కాస్త సమయం పడుతుంది. ఏడాదిన్నర తర్వాత అతడు మ్యాచ్‌లు ఆడుతున్నాడు. మీరు ఎంత బాగున్నా, గతంలో మాదిరిగా ఆడటం అంత సులువు కాదు. దానికి కాస్త సమయం పడుతుంది’’ అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.