
తాజా వార్తలు
తాజ్‌మహల్ వీక్షణ.. నిబంధనలు మారాయి
ఆగ్రా: తాజ్ మహల్ సందర్శనలో ఆన్లైన్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి.. ఐదుగురు పెద్దవారు, ముగ్గురు చిన్నారులకు మాత్రమే టికెట్లను బుక్ చేసుకోగలిగేలా నిబంధనలను సవరించింది. కాగా, గతంలో ఈ సంఖ్య 20గా ఉండేది. అంతేకాకుండా ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకునేప్పుడు ప్రతి పర్యాటకుడి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని.. వాటిని టికెట్లపై పొందుపరుస్తామని అధికారులు వివరించారు. ఇక పదిహేను సంవత్సరాలలోపు చిన్నారులకు ఎప్పటిలాగే ఉచితమని వారు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 17న మూతపడిన తాజ్‌ను.. తిరిగి సెప్టెంబర్ 21 న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే గతంలో మాదిరిగా కాకుండా రోజుకు కేవలం ఐదు వేల మందిని మాత్రమే, అది కూడా రెండు స్లాట్లలో అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తాజ్ సందర్శన ఆన్లైన్ టికెట్లను భారీగా బుక్ చేసుకుని.. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారని పర్యాటకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ బుకింగ్ నిబంధనలను మార్చినట్టు అధికారులు వివరించారు. అయితే ఇది తాజ్ పర్యాటకాన్ని వెనక్కి తీసుకెళ్లే నిర్ణయమని.. టూరిజం రంగానికి చెందిన స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
