ఇది పరీక్షా సమయం : మోదీ
close

తాజా వార్తలు

Updated : 11/06/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది పరీక్షా సమయం : మోదీ

దిల్లీ: ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌(ఐసీసీ) 95వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భారత్‌ పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పదని కొనియాడారు.

‘‘ ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్నాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో గట్టి పోరాటం సాగుతోంది. ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందుకెళ్లడమే మన కర్తవ్యం. ఇలాంటి పరీక్షా సమయంలో ధైర్యంగా ముందుకెళ్లాలి. భవిష్యత్‌ను నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే. ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కోంటోంది. విజయం సాధించే వరకు ఎక్కడా మనోధైర్యం కోల్పోకూడదు. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం అవసరం. ఐకమత్యమే మన బలం. నిరంతరం గెలుపుకోసం ప్రయత్నిద్దాం’’ అని మోదీ సూచించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని