రాహుల్‌పై శివసేన ప్రశంసలు
close

తాజా వార్తలు

Published : 19/04/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌పై శివసేన ప్రశంసలు

ముంబయి: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ అనేది ఎలా ఉండాలో చాటి చెప్పారని కొనియాడింది. కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రభుత్వానికి రాహుల్‌ కొన్ని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ రాహుల్‌ గాంధీ ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించారని శివసేన కొనియాడింది. మోదీకి, తనకు మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కనపెట్టి కలిసిపోరాడడానికి ముందుకు రావడం అభినందించాల్సిన విషయమని పేర్కొంది. ఇలాంటి విపత్కర సమయంలో మోదీ- రాహుల్‌ కలిసి చర్చిస్తే దేశానికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా కరోనాపై రాహుల్‌ తనవంతు ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ వచ్చారని గుర్తుచేసింది. విదేశాలకు ఔషధాల ఎగుమతి ఆపాలని రాహుల్‌ పదే పదే అభ్యర్థించారని పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని