HYD: అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ హత్య
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ హత్య

మైలార్‌దేవ్‌పల్లి‌: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో దారుణహత్య జరిగింది. అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ అసద్‌ ఖాన్‌‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. లార్‌దేవ్‌పల్లిలోని ఇండియా ఫంక్షన్‌ హాలు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ తీగలకుంట అచ్చిరెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న అసద్ ఖాన్ అలియాస్ అంజద్ ఖాన్(45) అతని మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పాతబస్తీ నైస్ హోటల్ మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆటోలో నుంచి దిగిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు అసద్ ఖాన్‌ను వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 2018లో అసద్ ఖాన్ వియ్యంకుడు అంజద్‌ ఖాన్‌ను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకునేందుకు అంజద్‌ ఖాన్‌ కుమారులు మరో ముగ్గురితో కలిసి అసద్‌ను హత్య చేసినట్లు భావిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసీన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని