close

తాజా వార్తలు

Published : 22/12/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దివాలాకు సాంగ్‌యాంగ్‌ మోటార్‌ దరఖాస్తు

ఎం అండ్‌ ఎం వెల్లడి

దిల్లీ: తమ దక్షిణ కొరియా విభాగమైన సాంగ్‌యాంగ్‌ మోటార్‌ కంపెనీ(ఎస్‌వైఎమ్‌సీ) దివాలాకు దరఖాస్తు చేసిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. డెటార్‌ రిహాబిలైజేషన్‌ అండ్‌ బ్యాంక్‌రప్టసీ యాక్ట్‌ ఆఫ్‌ సౌత్‌ కొరియా కింద సియోల్‌ దివాలా కోర్టులో ఆ సంస్థ దివాలా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో మహీంద్రా తెలిపింది. స్వయంప్రతిపత్తి పునర్నిర్మాణ మద్దతు(ఏఆర్‌ఎస్‌) కోసం నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ దాఖలు చేసింది. ఏఆర్‌ఎస్‌కు కోర్టు అనుమతి ఇస్తే కంపెనీ తన బోర్డు పర్యవేక్షణలో పనిచేస్తుంది. పునరుజ్జీవ ప్యాకేజీ కోసం వాటాదార్లతో చర్చలు జరుపుతుంది. రూ.408 కోట్ల రుణాలను చెల్లించడంలో సాంగ్‌యాంగ్‌ గత వారం విఫలమైంది. మొత్తం ఈ కంపెనీకి రూ.680 కోట్ల వరకు రుణాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాంగ్‌యాంగ్‌కు తాజా ఈక్విటీ చొప్పించడానికి మహీంద్రా నిరాకరించిన విషయం విదితమే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని