ఓ జాతీయ నాయకుడి పట్ల అలా వ్యవహరిస్తారా?
close

తాజా వార్తలు

Published : 02/10/2020 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ జాతీయ నాయకుడి పట్ల అలా వ్యవహరిస్తారా?

ముంబయి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పట్ల యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శలు గుప్పించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళుతున్న ఓ జాతీయ పార్టీ నాయకుడిని అడ్డుకోవడమే కాక, ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. యూపీలోని హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం రాహుల్‌ వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కింద పడిపోవడం వీడియోల్లో కనిపించింది.

‘‘రాహుల్‌ ఓ జాతీయ పార్టీ నేత. మాకు మాకు విభేదాలు ఉన్నా.. ఆయన పట్ల పోలీసులు వ్యవవహరించిన తీరు ఆక్షేపణీయం. ఆయన కాలర్‌ను పట్టుకుని నేలపైకి నెట్టారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన అత్యాచారం’’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం దారుణం’’ అని రౌత్‌ మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సైతం నిన్నటి ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని