close

తాజా వార్తలు

Published : 04/09/2020 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేఈఈ, నీట్‌పై రివ్యూపిటిషన్‌ కొట్టివేత

దిల్లీ: ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షల వాయిదా అంశాన్ని సుప్రీం కోర్టు మరోసారి తోసిపుచ్చింది. పరీక్షల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ భాజపాయేతర పార్టీల పాలనలోని ఆరు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పరిశీలించాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పరీక్షల నిర్వహణకే సుప్రీం మొగ్గు చూపింది.

గతంలో 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఈ పరీక్షల వాయిదాను కోరుతూ సుప్రీంను ఆశ్రయించగా... పరీక్షలు నిర్వహించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. పరీక్షలను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన వాటిలో మహారాష్ట్ర, బెంగాల్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్ఛేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కాగా.. నీట్‌ ఈ నెల 13న జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని