
తాజా వార్తలు
ఎన్టీఆర్‌పై భాజపాది కపట ప్రేమ:ఎల్.రమణ
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే విషయాన్ని విస్మరించిన భాజపా, తెరాస, ఎంఐఎం పార్టీలు.. ఓట్ల కోసం కొత్త ప్రయోగం చేస్తున్నాయని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. దుబ్బాక ఫలితాలతో సీఎం కేసీఆర్‌కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రూ.10వేలు వరద సాయం ప్రకటించారన్నారు. ఎన్టీఆర్ భవన్లో రమణ మీడియాతో మాట్లాడారు. వరద సాయం అందించడంలోనూ తెరాస నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండే అభ్యర్థులతో తెదేపా ఎన్నికల బరిలోకి దిగితే, భాజపా, తెరాస, ఎంఐఎం పార్టీలు నేర చరితులకు సీట్లు కేటాయించాయని విమర్శించారు.
కొంత మంది నేతలు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రమణ ఆక్షేపించారు. తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేసిన పెద్దలు, స్ఫూర్తిదాతల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉన్నాయని, అలాంటివారి స్మారకాలను కూల్చేయాలని కొంత మంది నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వని భాజపా.. ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తోందని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరులో మార్పు రావాలని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే చేకూరుస్తాయని వివరించారు. ఒవైసీ మెడికల్ కళాశాలను ఆక్రమణకు గురైన స్థలంలోనే నిర్మించారని.. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ శాంతి భద్రతలు తన అధీనంలో ఉన్నాయని చెబుతున్నారని, అలా అయితే నగరంలో రోహింగ్యాలు ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని రమణ డిమాండ్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- అందరివాడిని
- సాహో భారత్!
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కొవిడ్ టీకా అలజడి
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
