close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం : జగన్‌

వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చి ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ‘‘మన పాలన-మీ సూచన’ పేరిట విభాగాల వారీగా సీఎం మేధోమథన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో జగన్‌ మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఏడాది తిరగకముందే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం’’ అని జగన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబుకు శ్రేణుల ఘన స్వాగతం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన రోడ్డు మార్గంలో అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ కూడా ఉన్నారు. రెండు నెలలు తర్వాత రాష్ట్రంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబుకు దారి వెంబడి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలంగాణ నుంచి ఏపీకి చేరుకునే గరికపాడు చెక్‌పోస్టు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రేపట్నుంచి విమాన సర్వీసులు పెరిగే అవకాశం

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారితో మాట్లాడతామని తెలిపారు. ఇవాళ 19 చొప్పున విమానాలు వచ్చి వెళతాయని, రేపటి నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని సీఎస్‌ చెప్పారు. ప్రయాణికులు లేకే కొన్ని విమానాలు రద్దు అవుతున్నాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తొలి రోజే 80 సర్వీసులు రద్దు..!

4. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 హత్యలు

 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట ఘటనలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడు ఏకంగా 9 హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొలుత మక్సూద్‌ బంధువైన యువతిని నిందితుడు సంజయ్‌కుమార్‌ హత్య చేశాడు. మార్చి 8న ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కోల్‌కతా తీసుకెళ్తున్నట్లు చెప్పి నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్‌ కుటుంబాన్ని హతమార్చాడు. దీంతో మొత్తం 10 మందిని నిందితుడు సంజయ్‌కుమార్‌ హత్య చేసినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తితిదే బోర్డు పునర్‌వ్యవస్థీకరించాలి: ఐవైఆర్‌

తిరుమల శ్రీవారి లడ్డూలు బహిరంగ మార్కెట్లో అమ్మకం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయాలను తితిదే మాజీ ఈవో, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ తరహా చర్యలు అర్థం లేనివని వ్యాఖ్యానించారు. దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మాలన్న నిర్ణయం సరికాదన్నారు. ఆలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. దేశమంతా స్థిరాస్తి రంగం కోలుకోలేని పరిస్థితితో ఉంటే ఆస్తులను విక్రయానికి పెడతారా? అని తితిదేను ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం

6. కొత్త మాస్క్‌ గురూ.. ఇక గుర్తు పట్టేయొచ్చు!

కరోనాతో నెలకొన్న కష్ట కాలంలో ఎక్కడ చూసినా జనం మాస్క్‌లతోనే కనబడుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు ఈ మహమ్మారితో కలిసి బతకాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రతిఒక్కరి జీవితంలో మాస్క్‌ ధరించడం తప్పనిసరైంది. నిత్యావసరంగా మారిన మాస్క్‌లకు గిరాకీ ఏర్పడటంతో రోజురోజుకీ కొత్త కొత్త వెరైటీలతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే, మాస్క్‌లు పెట్టుకున్నవారి ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండటంతో  వారిని గుర్తుపట్టడం కష్టతరంగా మారింది. ఈ ‘గుర్తింపు’ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ వినూత్నంగా ఓ మాస్క్‌ను రూపొందించి తనదైన ప్రత్యేకతతో వార్తల్లో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అది చైనా చెర్నోబిల్‌ : అమెరికా

కరోనా వైరస్‌ మహమ్మారిగా మారడానికి కారణమైన చైనాపై అమెరికా ఆరోపణల పర్వం కొనసాగుతోంది.  సోవియట్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణుప్రమాదంతో కరోనావైరస్‌ను పోలుస్తూ చైనాపై విమర్శలు గుప్పించింది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో డ్రాగన్‌ వ్యవహార శైలి, చెర్నోబిల్‌ దుర్ఘటన సమయంలో సోవియట్‌ తీరులాగే కనిపిస్తోందని తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ విమర్శించారు. వైరస్‌తో ఏం జరుగుతుందన్న విషయం చైనాకు ముందే తెలిసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పుదోవ పట్టించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిల్లీ టు బెంగళూరు: ఒంటరిగా ఐదేళ్ల బాలుడు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా నిబంధనల మేరకు ప్రజా రవాణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు నడుస్తుండగా, సోమవారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల బాలుడు ఒంటరిగా దిల్లీ నుంచి బెంగళూరు విమాన ప్రయాణం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

9. ఆ రీఛార్జ్‌ ప్లాన్‌ను ఆపేసిన జియో

అతి తక్కువ ధరకు డేటాను అందరికీ అందుబాటులోకి తెచ్చిన సంస్థ జియో. గత కొంతకాలంగా వివిధ రీఛార్జ్‌లపై ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జియో నెట్‌వర్క్‌లోని అతి తక్కువ ప్లాన్‌ రూ.98 ఒకటి. ఇప్పుడు దీని ధరను పెంచి రూ.129గా నిర్ణయించింది. దీంతో జియో అందించే ఆఫర్లలో ఇదే అతి తక్కువ ప్లాన్‌. రూ.129తో రీఛార్జ్‌ చేసుకుంటే 2 జీబీ డేటా, జియో-టు-జియో అపరిమిత కాల్స్‌, రోజుకు 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బల్బీర్‌ వల్లే 1975 ప్రపంచకప్‌ గెలిచాం

1975లో భారత హాకీ జట్టు ప్రపంచకప్‌ గెలవడానికి.. దిగ్గజ ఆటగాడు, నాటి మేనేజర్‌ సీనియర్‌ బల్బీర్‌ సింగే కీలకమని అప్పటి సారథి అజిత్‌ పాల్‌ పేర్కొన్నాడు. భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన బల్బీర్‌ మృతిచెందడంతో తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానన్నాడు. తమ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పాడు. ఆ ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ దశలోనే ఆశలు వదులుకుందని, సరిగ్గా అప్పుడే జట్టు మేనేజర్‌గా ఉన్న బల్బీర్‌.. తమకు ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.