close

తాజా వార్తలు

Updated : 29/09/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. డ్రాగన్‌పై ‘నిర్భయ’ గురి..! 

చైనా సరుకు ఎంత నాణ్యమైందో.. చైనా ఒప్పందాలు కూడా అంతే నమ్మకమైనవి. చైనాతో ఏ ఒప్పందం చేసుకున్నా.. కళ్లుమూసుకొని నమ్మేయకూడదు. దానిపై వెయ్యికళ్లతో నిఘాపెట్టాలి. గత కొన్నేళ్లుగా భారత్‌ సరిహద్దుల్లో వాయుసేన స్థావరాలను చైనా  క్రమంగా పెంచేసింది. ఇప్పుడు తాపీగా ఇక బలగాలను పంపకూడదని ఒప్పందానికి వచ్చింది. పైకి చెప్పకపోయినా.. భారత్‌ కూడా ఎక్కడా రాజీపడకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. తన కీలక ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ

చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని డీజీపీ పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారీగా తగ్గిన కొవిడ్‌ మరణాలు, కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. నిత్యం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండగా నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 776 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 96,318కు చేరింది. అయితే, రోజువారీ మరణాలు 800 దిగువన నమోదుకావడం రెండు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ఆగస్టు 4 నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజు కూడా రోజువారీ మరణాల సంఖ్య ఎనిమిది వందల కంటే తక్కువ నమోదుకాలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు

4. నిమిషాల్లో కరోనా ఫలితాలిచ్చే కొత్త విధానం

కేవలం నిమిషాల వ్యవధిలోనే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందించగల ఓ నూతన విధానాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది దిగువ, మధ్యతరగతి ఆదాయ దేశాల్లో కేసుల నిర్ధారణకు అద్భుతంగా ఉపయోగపడుతుందని అంతర్జాతీయ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడిలో ఈ ఆవిష్కరణ ఓ గొప్ప మైలురాయి కాగలదని సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రియాసిస్‌ అభివర్ణించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సుశాంత్‌ కేసు: నివేదిక సమర్పించిన ఎయిమ్స్‌ బృందం

నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మరణంపై దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సమర్పించింది. సీబీఐ అభ్యర్థన మేరకు వైద్యుడు డా.సుధీర్‌ గుప్తా అధ్యక్షతన ఓ ఫోరెన్సిక్‌ వైద్య బృందం ఏర్పాటైంది. సుశాంత్‌ శరీర అంతర్భాగాల్లోనుంచి తీసిన నమూనాలకు సెప్టెంబర్‌ 7న సదరు ఫోరెన్సిక్‌ బృందం పరీక్షలు నిర్వహించింది. మరో ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా నటుడి ఇంటికి సీబీఐ తీసుకెళ్లి ఫోరెన్సిక్‌ సహా తదుపరి దర్యాప్తు కోసం పరీక్షలు నిర్వహించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మీరిచ్చే 10 లక్షల ఉద్యోగాలు అవేనా?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బిహార్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్‌ భాజపా బాధ్యుడు దేవేంద్ర ఫడణవీస్‌ తప్పుబట్టారు. ఆర్జేడీ ప్రకటనను ఖండించారు. పది లక్షల స్వదేశీ పిస్తోళ్లను కొనుగోలు చేసి, తమ కార్యకర్తలందరికీ పంచిపెట్టి కిడ్నాప్‌లు, దొంగతనాలు చేయమని పంపించి వాటినే ఉద్యోగాలుగా పరిగణిస్తారేమోనని దుయ్యబట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మృగాళ్ల వేటను తట్టుకోలేక..ప్రాణాలు వదిలింది

 ఆమె.. మనిషి రూపంలో కొన్ని మృగాళ్లు తిరుగుతుంటాయని గ్రహించలేకపోయింది. దగ్గర్లోనే తన కుటుంబం ఉండగా తనకేం భయం అనుకుంది. అందుకే ఒంటరిగా తన పని తాను చేసుకుపోయింది. కానీ, మాటువేసిన మృగాళ్ల గురించి తెలుసుకోలేక, తనపై జరగబోయే దాడిని పసిగట్టలేకపోయింది. అందుకే అ నలుగురి కర్కశ వేటలో గాయపడి.. కోలుకోలేక కన్నుమూసింది. ఇదంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో ఓ 20 ఏళ్ల యువతికి జరిగిన ఘోర అన్యాయం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టాటా యాప్‌లోకి ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తులు?

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌తో చేతులు కలిపేందుకు ప్రముఖ అంతర్జాతీయ రిటైల్‌ కంపెనీ వాల్‌మార్ట్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌ ప్రారంభించబోతున్న ఓ సూపర్‌ యాప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న టాటా క్లిక్‌, స్టార్‌ క్విక్‌, టాటా స్కై, క్రోమా వంటి రిటైల్‌ ఛానెల్స్‌ అన్నింటినీ ఒకే సూపర్‌ యాప్‌ కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’: తారక్‌, చరణ్‌ పాత్రల్లో వీరే..!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. అది సరే.. మరి చిత్రంలో బాల నటులు ఉన్నారా?.. ఉంటే, వాళ్లెవరు?.. మరోపక్క ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్‌లో జక్కన్న, తారక్‌, చెర్రీతో కలిసి చిన్నారులు దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాల నటులు చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన చతుర్వేది ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 2020.. తెవాతియా అయిపోతే ఎంత బాగుండు!

2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకొన్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనాలో ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్‌లోనూ ప్రవేశించింది. ఊహించని వేగంతో చాలామందిని కాటేసింది. లాక్‌డౌన్లు.. ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. సాటి మనిషిని ఆప్యాయతతో హత్తుకొనేవారే కరవయ్యారు. ఎడం పెరిగింది. మాస్క్‌లు ముఖాలకు ఆభరణాలుగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.