ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాల్సిందే:ట్రంప్‌
close

తాజా వార్తలు

Updated : 11/09/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాల్సిందే:ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తేల్చిచెప్పారు. ‘టిక్‌టాక్‌కు విధించిన గడువు పొడిగింపు ఉండదు. ఆ సమయంలోగా దాన్ని వారు మూసివేయడమో, విక్రయించడమో జరుగుతుంది’ అంటూ ట్రంప్ విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, దీనిపై టిక్‌టాక్‌ స్పందించాల్సి ఉంది. యూఎస్‌ కార్యకలాపాలను విక్రయించాలన్న ట్రంప్ ఆదేశాల ప్రకారం సెప్టెంబరు మధ్యనాటికి ఆ ప్రక్రియను పూర్తి చేయడం కోసం బైట్‌డ్యాన్స్‌ కొనుగోలుదారు కోసం వెతుకుతోంది. ఆ సంస్థ చైనాకు చెందినది. 

ఈ యాప్‌ను వినియోగించే యూజర్ల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై యూఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే ట్రంప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాలను విక్రయించేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, వినియోగదారుల సమాచారం భద్రంగా ఉందని టిక్‌టాక్‌ గతంలోనే వెల్లడించింది.     


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని