close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120083920 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 4eja-GQbPAU [video_short_link] => 4eja-GQbPAU [created_by] => [created_date] => [modified_by] => 1071079 [modified_date] => 2020-07-09 19:54:13.680351 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120083920 [video_srlno] => 2 [video_type] => 3 [video_link] => 1281089710681554945 [video_short_link] => 1281089710681554945 [created_by] => [created_date] => [modified_by] => 1071079 [modified_date] => 2020-07-09 19:54:13.729942 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 09/07/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యూపీ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే అరెస్ట్‌!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ ఆల‌యంలో ప‌ట్టుబ‌డ్డ గ్యాంగ్‌స్ట‌ర్‌

కాన్పూర్: కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘ‌ట‌న‌లో ప్ర‌ధాననిందితుడైన వికాస్ దూబే ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. వారం రోజులుగా పోలీసుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యిన్‌‌లోని ఓ గుడివ‌ద్ద నేటి ఉద‌యం అరెస్టు చేశారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అత‌ని ఇద్ద‌రు ప్ర‌ధాన‌ అనుచ‌రులు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన స‌మ‌యంలోనే వికాస్ దూబేను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

ఉజ్జ‌యిన్‌‌లోని ఓ ఆల‌యంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి గుర్తించి పోలీసులకు స‌మాచారం అందజేశాడు. అప్ప‌టికే అనుమానం వ‌చ్చిన ఆల‌య సెక్యూరిటీ విచారించ‌గా త‌ప్పుడు ఐడీ కార్డు చూపించడంతోపాటు వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకొని అత‌న్ని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో... 'నేను వికాస్ దూబే ని, కాన్పూర్ వాలా' అని గట్టిగా అరవడం గమనార్హం.




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.