‘వంద బిలియన్ డాలర్ల’ క్లబ్‌లో జుకర్‌బర్గ్‌
close

తాజా వార్తలు

Updated : 08/08/2020 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ‘వంద బిలియన్ డాలర్ల’ క్లబ్‌లో జుకర్‌బర్గ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో పెరిగిన ఫేస్‌బుక్‌ షేర్ల విలువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘వంద బిలియన్ డాలర్ల’ క్లబ్‌లో స్థానం సంపాదించుకున్నారు. తద్వారా సాంకేతిక దిగ్గజాలైన అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సరసన నిలిచారు. టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ కొత్త వీడియో యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనితో ఫేస్‌బుక్‌ షేర్ల విలువ గురువారం నాటికి ఆరు శాతానికి పైగా పెరిగింది. ఫేస్‌బుక్‌లో 13 శాతం వాటా జుకర్‌బర్గ్‌ ఆధీనంలో ఉండటంతో.. ఆయన సంపద విలువ 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కాగా, ఫేస్‌బుక్‌ షేర్లలో 99 శాతాన్ని మార్క్‌, తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలసి నెలకొల్పిన సేవాసంస్థ ద్వారా దానం చేసే ఆలోచనలో ఉన్నారు.

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిమాండ్‌ పెరగటంతో.. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌ వంటి సాంకేతిక దిగ్గజాలు లాభపడ్డాయి. అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌’కు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఫేస్‌బుక్‌ ఈ వీడియో యాప్‌ను భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. 

కాగా, తమ పోటీ సంస్థ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించటంపై జుకర్‌బర్గ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ టిక్‌టాక్‌పై నిషేధం విధించిన విధంగానే, ఫేస్‌బుక్‌పై వేరే దేశం వేటు వేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్‌ నిర్ణయం దీర్ఘకాలంలో చెడు ప్రభావాన్ని చూపగలదని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు 15 లోగా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను ఏదైనా అమెరికా సంస్థ కొనుగోలు చేయవచ్చని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ కొనుగోలుపై ఫేస్‌బుక్‌ నిర్ణయాన్ని మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పష్టం చేయలేదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని