ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఉద్యోగభద్రత కల్పించాలి
close

తాజా వార్తలు

Published : 22/03/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఉద్యోగభద్రత కల్పించాలి

ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి: కరోనా విపత్తు సమయంలో విధులు నిర్వర్తించిన వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగించి మాట తప్పిందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉద్యోగ భద్రత కోసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ గుంటూరులో చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని ఆయన ఖండించారు. వారిని వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా విధుల కోసం తీసుకున్న పది వేల మంది పారా మెడికల్‌ సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. వారికి ఆరు నెలల జీతాలు ఇవ్వకపోగా విధులు నుంచి తొలగించారని దుయ్యబట్టారు. 

ఒప్పంద పద్ధతిలో తీసుకున్న సిబ్బందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాత్సరం చేయడం తగదని అచ్చెన్నాయుడు అన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్‌ వద్ద కొవిడ్ వారియర్స్‌ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి భగ్నం చేశారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్న వారిని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని