ఏపీలో ఎన్నికలపై ఉద్యోగ సంఘాల స్పందన 
close

తాజా వార్తలు

Updated : 23/01/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఎన్నికలపై ఉద్యోగ సంఘాల స్పందన 

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పందించింది. సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... టీకాలు ఇచ్చే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
‘‘ మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉంది. ప్రాణాలను కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ప్రాణాపాయం వస్తే ఎదుటి వాణ్ని చంపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మా హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నాం.ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్‌ఈసీ ఉన్నారు. విధుల్లో పాల్గొనడానికి సమ్మతించే ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకోవచ్చు’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి..
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
అన్నా రాంబాబు ఎలా గెలుస్తారో చూస్తా : పవన్‌

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని