11 రోజుల్లో.. రూ. 18కోట్లు పట్టివేత
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11 రోజుల్లో.. రూ. 18కోట్లు పట్టివేత

అసోంలో రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం

గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసోంలో ముమ్మర తనిఖీలు చేపట్టగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో నగదు, మద్యం, మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. కేవలం 11 రోజుల్లోనే రూ. 18కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి 110 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

ఫిబ్రవరి 26న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌  రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో సోమవారం నాటికి రూ. 18.31కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సదరు బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల విభాగం వెల్లడించింది. ఇందులో రూ. 4.27కోట్ల నగదు కాగా..  రూ. 5.52కోట్ల విలువైన మద్యం, రూ. 4కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. కోటి విలువైన బంగారం, వెండి, రూ. 3.52కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరాలో 100 మందిని, మాదకద్రవ్యాల సంబంధిత నేరాల్లో మరో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున నగదు లభ్యమవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి విడత, ఏప్రిల్‌ 1న రెండో విడత, ఏప్రిల్‌ 6న మూడో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని