భూపాలపల్లిలో బండి సంజయ్‌ అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భూపాలపల్లిలో బండి సంజయ్‌ అరెస్టు

అనంతరం విడుదల

భూపాలపల్లి టౌన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌ పంపించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సమరభేరి సభకు శుక్రవారం బండి సంజయ్‌ హాజరయ్యారు. అక్కడి నుంచి ఉద్యోగాల భర్తీ కోరుతూ ఆత్మహత్యకు యత్నించి, అనంతరం మృత్యువాత పడిన సునీల్‌ నాయక్‌ (25) అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయల్దేరారు. భూపాలపల్లి మీదుగా మృతుడి స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్‌సింగ్‌ తండాకు వెళుతుండగా.. సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు బాంబులగడ్డలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్థానిక భాజపా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు తోపులాట జరిగింది. భారీ బందోబస్తు మధ్య సంజయ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు పరిస్థితులు అదుపులోకి వచ్చాక హైదరాబాద్‌ పంపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని