
తాజా వార్తలు
ఆ పసివాడు మృత్యుంజయుడు!
రాజేంద్రనగర్: ఒంటిపై చిన్న దెబ్బతగిలితేనే పసి ప్రాణాలు తట్టుకోలేవు. అలాంటిది ఏకంగా కారు రెండు టైర్ల మధ్యలో చిక్కుకొని కొంత దూరం ఈడ్చుకెళ్తే.. ఊహించలేకుండా ఉంది కదా! అవునండీ.. ఇలాంటి హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ చిన్నారి తృటిలో తప్పించుకొని మృత్యుంజయుడిగా నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధి ఉప్పర్‌పల్లిలోని అశోక్ విహార్‌లో ఓ చిన్నారి గేటు ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో సెల్లార్ నుంచి ఓ కారు బయటకు వెళ్తుతోంది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిని గమనించని కారు డ్రైవర్ కారుని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు వెనకపైపు ఉన్న రెండు టైర్ల మధ్య ఇరుక్కుపోయిన చిన్నారిని కొంతమేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తృటిలో తప్పించుకున్నాడు. కానీ చిన్నారి ముఖం కుడిపైపు గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అపార్ట్మెంట్లో ఉద్యోగులను దించేందుకు వచ్చిన వాహనంగా గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులుకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి..
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
దేశవ్యాప్తంగా 31న పల్స్ పోలియో
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
