
తాజా వార్తలు
అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ధైర్యంగా ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలని ఫోన్లో అఖిలప్రియకు చంద్రబాబు చెప్పారు. తాను ధైర్యంగా ఉంటూనే తోటివారికి ధైర్యం చెప్పాలని అఖిలప్రియకు చంద్రబాబు సూచించారు.
ఇవీ చదవండి..
సీఎం ఇంటిని ముట్టడిస్తే అత్యాచారయత్నం కేసా?
Tags :