close

తాజా వార్తలు

Updated : 27/02/2021 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పోలీసులు లేకుండా కుప్పంలో తిరగ్గలరా?’

వైకాపా నేతలకు చంద్రబాబు ప్రశ్న

రామకుప్పం: సంక్షోభంలోనే పోరాట సత్తా చూపించాలని పార్టీ కార్యకర్తలకు తెదేపా అధినేత చంద్రబాబు  పిలుపునిచ్చారు. ఇకపై మూడు నెలలకు ఒకసారి కుప్పం వస్తానని చెప్పారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు రామకుప్పంలో మండల తెదేపా నేతలతో ఆయన సమావేశమయ్యారు. సీఎం జగన్‌ను చూసి పుంగనూరు నేత ఒకరు రెచ్చిపోతున్నారని పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కర్ణాటక నుంచి మద్యం, డబ్బు తీసుకొచ్చారని చెప్పారు. పోలీసులు లేకుండా కుప్పంలోని ఒక్క వీధిలోనైనా తిరగగలరా? అని వైకాపా నేతలను ప్రశ్నించారు. వాళ్లది పోలీసు బలం.. తనది ప్రజా బలమని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ అబద్ధాలు చెప్పారని.. రాష్ట్రంలో కేవలం మద్యం నుంచే రూ.5వేల కోట్లు దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపు కుప్పంకు నీళ్లిస్తానన్నారు. 

ఇచ్చేది రూ.10.. దోచుకునేది రూ.100

అంతకుముందు రామకుప్పం, శాంతిపురం మండలాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైకాపా అరాచకాలపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ మాటలకు, చేతలకు పొంతనే లేదని ఆక్షేపించారు. ప్రజలకు ఇచ్చేది రూ.10.. వారి జేబులోంచి దోచుకునేది రూ.100 అని ఆరోపించారు. ప్రజా తిరుగుబాటును కుప్పం నుంచే ప్రారంభిస్తానన్నారు. 

 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని