చికెన్‌ పకోడి బండి వద్ద వివాదం..బాలుడి మృతి
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చికెన్‌ పకోడి బండి వద్ద వివాదం..బాలుడి మృతి

కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి చికెన్‌ పకోడి బండి వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బండి వద్ద అమ్మకం దారుడు ఏసు, కొనుగోలు దారుడు కొవ్వూరి వీరబాబు వద్ద స్పల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో కోపాద్రిక్తుడైన వీరబాబు తన స్కార్పియో వాహనంతో బండిని ఢీకొట్టాడు. దీంతో తండ్రి ఏసు, కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం వీరబాబు శివపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివను కాకినాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. పదో తరగతి చదువుతూ తండ్రికి సాయం చేసే శివ మృతిచెందటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో వీరవరం గ్రామంలో మోహరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని