Corona: ఆక్సిజన్‌ అందక భార్య ఒడిలోనే..
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఆక్సిజన్‌ అందక భార్య ఒడిలోనే..

నాసిక్‌: మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రాణవాయువే కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్‌ బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. అలాంటి ఘటనే నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన అరుణ్‌ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. ఆస్పత్రిలో పడకలు లేవని సిబ్బంది చేర్చుకోలేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో కనీసం ఆక్సిజన్‌ అయినా పెట్టాలని భార్య వేడుకుంది. వైద్య సిబ్బంది స్పందించేలోపే అరుణ్‌.. తన భార్య ఒడిలోనే కన్నుమూశాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని