
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 1,728 కేసులు.. 9 మరణాలు
బులెటిన్ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 77,148 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,728 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,49,705కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా మరణించిన వారితో కలిపి రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,837కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,777 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో మొత్తంగా 8,22,011 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,857 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 89,40,488 కరోనా సాంపుల్స్ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..