close

తాజా వార్తలు

Updated : 12/01/2021 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ చేరిన కొవిషీల్డ్‌ టీకా

దిల్లీ: తొలిదశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా డోసులు పుణె నుంచి దిల్లీకి చేరుకున్నాయి. స్పైస్‌జెట్‌ ప్రత్యేక విమానం కొవిడ్‌ డోసులను దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేర్చింది. దీనిపై స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సహా దిల్లీ విమానాశ్రయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కొవిడ్‌ టీకాలను రవాణా చేయడం గర్వంగా ఉందని స్పైస్‌జెట్‌ తెలిపింది. సకాలంలో అన్ని ప్రాంతాలకు టీకా డోసులను చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ చరిత్రాత్మక వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపింది.

దిల్లీ ఎయిర్‌పోర్టు వర్గాలు సైతం కొవిడ్‌ టీకాల రవాణాపై హర్షం వ్యక్తం చేశాయి. కొవిడ్‌ సంక్షోభంలో అన్ని రకాల వైద్య పరికరాలను దేశవ్యాప్తంగా సకాలంలో చేర్చేందుకు కృషి చేశామని.. టీకా విషయంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తామని ‘దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌’ సీఈవో తెలిపారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రెండు కార్గో టెర్మినళ్లలో (మైనస్‌)-20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి +25 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు మెయింటైన్‌ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో టీకాలను భద్రంగా నిల్వచేసే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. ఒక్కరోజులో 5.7 మిలియన్‌ వయల్స్‌ని నిల్వ చేయగలమని తెలిపారు. టీకాను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సకాలంలో చేర్చేందుకు ఇప్పటికే విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, లాజిస్టిక్‌ సంస్థలు, ఎగుమతి-దిగుమతి వ్యవస్థలు, ప్రభుత్వం, కార్గో టెర్మినళ్లలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారీ కేంద్రం నుంచి టీకా డోసుల్ని మంగళవారం వేకువజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా బట్వాడా చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం.

ఇవీ చదవండి..

బయలుదేరిన కరోనా టీకా!

యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని