Cyberabad Traffic Police: బాచుపల్లి రోడ్డు ప్రమాదం వీడియో షేర్‌ చేసిన పోలీసులు

తాజా వార్తలు

Published : 03/08/2021 13:18 IST

Cyberabad Traffic Police: బాచుపల్లి రోడ్డు ప్రమాదం వీడియో షేర్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌: చిన్న నిర్లక్ష్యం చాలు.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోవటానికి. రెప్పపాటులో జరిగే ప్రమాదం చాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేయటానికి. మితిమీరిన వేగం, అత్యుత్సాహంతో రెప్పపాటులో జరిగే ప్రమాదాలు నిత్యం ఎంతో మందిని బలితీసుకుంటుండగా.. గాయపడిన వారు జీవితాంతం దివ్యాంగులుగా మారుతున్నారు.

హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో గత నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. లారీని ద్విచక్రవాహనదారుడు ఓవర్ టేక్  చేసే క్రమంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్ లారీ కింద పడిపోయింది. అదే వేగంతో ద్విచక్రవాహనదారుడిపై నుంచి లారీ దూసుకెళ్లటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. కనీస జాగ్రత్తలైనా పాటించకుండా పక్కనున్న వాహనాలను పరిశీలించకుండా... వాహనం నడపటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలను సైబరాబాద్  పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని