close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 5 PM

1. రూ1.70లక్షల కోట్ల ప్యాకేజీ:నిర్మలా సీతారామన్‌

కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గురువారం ఆమె దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కరోనా: ఇక భారత్‌లో ‘టెలీమెడిసిన్‌’ వైద్యసేవలు

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనావైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రేపు ఏపీ కేబినెట్‌ భేటీ

ఏపీ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో కేబినెట్‌ భేటీ జరగనుంది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో సీఎం జగన్‌ సహా మంత్రులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మూడు నెలల బడ్జెట్‌కు సంబంధించి  జూన్‌ 30 వరకు అవసరమైన నిధుల కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. తొలిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గుంటూరులో మరో 3 అనుమానిత కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో ఐడీ ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు వ్యక్తులు జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని బుధవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్‌-19 ప్రత్యేక విభాగానికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పవన్‌ స్ఫూర్తితో చెర్రీ సాయం

గురువారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.. కరోనా కల్లోలం కోసం పాటుపడుతోన్న కేంద్ర, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నానని తెలియచేస్తూ తొలి ట్వీట్‌ను చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌తో స్ఫూర్తి పొందిన నేను.. కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలకు నా వంతు సాయంగా రూ.70 లక్షలను ఆయా సహాయనిధిలకు అందిస్తున్నాను’’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆర్థిక ప్యాకేజీ అండతో.. దూసుకెళ్లిన సూచీలు

కరోనా దెబ్బకు పాతాళానికి పతమైన దేశీయ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనించాయి. కరోనా నేపథ్యంలో గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌1,410 పాయింట్లు లాభపడి 29,946 వద్దకు చేరగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8,641 వద్ద స్థిరపడింది. రూపాయితో డాలర్‌ మారకం విలువ 75.25 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 90 శాతం కరోనా కేసులు అక్కడే...

ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 90 శాతం కరోనా కేసులు 3 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 4-9 g/m3 కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలియచేసింది. గత అభిప్రాయాలకు భిన్నంగా, ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్‌-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దిల్లీలో దుకాణాలు @ 24 గంటలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైందని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కరోనాపై పోరులో భారత్‌ గెలుస్తుంది: చైనా

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి అత్యవసర సమయంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో భారత్‌ చేసిన సాయానికి చైనా మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.