
తాజా వార్తలు
నరకాగ్ని అలా ఉంటుంది!
ఇస్లాం సందేశం
ఈనెల 22 షబే మేరాజ్
ఒకరోజు రాత్రి ముహమ్మద్ ప్రవక్త (స) నిద్రపోతూ ఉండగా ‘‘జిబ్రీల్’’ దైవదూత వచ్చి మేల్కొలిపారు. ఆయన్ను కాబా గృహానికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన హృదయాన్ని జమ్జమ్ జలంతో శుభ్రపరిచారు. దాన్ని విశ్వాసం, వివేకం, విజ్ఞతలతోనూ నింపారు. తరువాత ఒక వాహనంపై మేరాజ్ ప్రయాణం మొదలైంది. ఒక్కో ఆకాశాన్నీ దాటుకుంటూ సప్తాకాశాలను సందర్శించారు. అల్లాహ్ను కలుసుకుని ఆయనతో మాట్లాడారు.
ఈ యాత్రను మేరాజ్ యాత్ర అంటారు. ఈ సందర్భంగా పాపాత్ములు పరలోకంలో అనుభవించే ఈ శిక్షలను కళ్లారా చూశారు. మరణానంతరం వారు ఎలాంటి పరిస్థితులకు గురి అవుతారో ఆ దృశ్యాలను ప్రవక్త (స) తిలకించారు. ఆ విషయాలను తమ సహచరులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. నరకాగ్ని నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రజల్లో శాంతి సందేశాన్ని చేరవేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రజబ్ నెల 27వ తేదీ రాత్రి జరిగిన ఈ పర్యటనను ‘షబే మేరాజ్’గా జరుపుకుంటారు. పాప ఫలితాలను కళ్లకు కట్టే ఈ సందర్భం ఇస్లాం జగత్తులో ఎంతో ప్రాచుర్యం పొందింది.
- ఖైరున్నీసా బేగం