
తాజా వార్తలు
డేటా సైన్స్‌లో చేరాలంటే...
* బీఎస్సీ (ఎంపీసీ) చదివాను. డేటా సైన్స్ చదవాలనుంది. అందించే సంస్థలు, ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి.
- బి. నాగ్
* డేటా సైన్స్ కోర్సులకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా కంపెనీలు డేటా సైన్స్‌కు సంబంధించిన టూల్స్‌లో నైపుణ్యం ఉన్నవారి కోసం ఎదురుచూస్తున్నాయి. బీఎస్సీ ఎంపీసీ గ్రూపు డేటా సైన్స్ నేర్చుకోవడానికి చక్కగా తోడ్పడుతుంది. మనదేశంలో పలు విశ్వవిద్యాలయాలు ఎంబీఏ, ఎంఎస్సీ ఇన్ డేటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, యూనివర్సిటీ ఆఫ్ పుణె, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, భారతీయార్ యూనివర్సిటీ-కోయంబత్తూర్, సెయింట్ జేవియర్ కాలేజీ-అహ్మదాబాద్ లాంటి విద్యాసంస్థలు ఎమ్మెస్సీ ప్రోగ్రాంలను ప్రవేశ పరీక్ష ఆధారంగా అందిస్తున్నాయి. యూనివర్సిటీల వెబ్ సైట్ల్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
డేటా సైన్స్‌తో పాటుగా డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ లాంటి కోర్సులనూ చదివే అవకాశం ఉంది. మాస్టర్స్ కోర్సులు మాత్రమే కాకుండా సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా, పీజీ డిప్లొమాల గురించీ ఆలోచించవచ్చు.డేటా సైన్స్‌కి సంబంధించి కొన్ని ప్రైవేటు కంప్యూటర్ సంస్థలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. కోర్స్ఎరా, ఎడెక్స్, యుడెమి లాంటి ఆన్లైన్ వేదికల్లో డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్