
తాజా వార్తలు
పిల్లల కోసం పెట్టుబడి...
చిన్న పిల్లల భవిష్యత్ అవసరాలు, ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ‘ఎస్బీఐ మాగ్నమ్ ఛిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్- ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ పేరుతో ప్రారంభించిన ఈ ఓపెన్ ఎండెడ్ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ఈ నెల 22న ముగుస్తుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల పేరుమీద పెట్టుబడి పెట్టాలి. ఆర్.శ్రీనివాసన్ (ఈక్విటీ), దినేష్ ఆహుజా (డెట్) ఈ పథకానికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
దీని ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి
* ఈ ఫండ్ సేకరించే నిధులను 65 నుంచి 100 శాతం వరకూ ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడతారు. పన్ను మదింపు విషయానికి వస్తే.. దీనికి ‘ఈక్విటీ స్కీమ్’ టాక్సేషన్ వర్తిస్తుంది.
* మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు.
* అంతేగాక అంతర్జాతీయ ఈక్విటీ షేర్లు, గోల్డ్ ఈటీఎఫ్, రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) లలోనూ పెట్టుబడి పెట్టవచ్చు.
* ఈ పథకంపై పెట్టుబడికి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. లేదా ఎవరి పేరు మీద అయితే పెట్టుబడి నమోదు అయిందో... ఆ అబ్బాయి/ అమ్మాయికి 18 ఏళ్ల వయసు రావాలి. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే... దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
* పేరెంట్/ గార్డియన్ బ్యాంకు ఖాతా నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టటానికి వీల్లేదు. పిల్లల పేరుతో తెరిచిన బ్యాంకు లేదా పిల్లలు/ తల్లితండ్రుల ఉమ్మడి బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుంది.
* ఈ పథకానికి డివిడెండ్ ఆప్షన్ లేదు. గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.
* ‘క్రిసిల్ హైబ్రీడ్ 35+ 65 - అగ్రెసివ్ ఇండెక్స్’ తో దీని పనితీరును పోల్చి చూస్తారు.
ఇప్పటికే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇప్పటికే ఎస్బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్- సేవింగ్స్ ప్లాన్‌ను నిర్వహిస్తోంది. కాకపోతే ఈ ఫండ్ ప్రధానంగా రుణపత్రాల్లో పెట్టుబడులు పెడుతుంది. కానీ దీనికి భిన్నంగా ఎస్బీఐ మాగ్నమ్ ఛిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్- ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాత్రం ఈక్విటీ షేర్లలో మదుపు చేస్తుంది. తద్వారా ఎక్కువ నష్టభయం ఉన్నప్పటికీ అధిక ప్రతిఫలాన్ని కూడా సాధించే అవకాశం ఉంటుంది.
20 పెద్ద కంపెనీల్లో...
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని తీసుకువస్తోంది. ‘ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ 20 ఈక్విటీ ఫండ్’ అనే పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 23న ముగుస్తుంది. ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. ‘సిప్’ పద్ధతిలో అయితే కనీసం పెట్టుబడి రూ.500. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్. కాబట్టి, ఎన్ఎఫ్ఓ ముగిసిన తర్వాత యూనిట్ల క్రయ-విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇటీవల కాలంలో ఫోకస్డ్ ఫండ్లకు ఆదరణ అధికంగా ఉండటాన్ని గమనించి ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద 20 పెద్ద కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతారు. అందులోనూ 50 - 70 శాతం నిధులను లార్జ్ క్యాప్ తరగతి కిందకు వచ్చే షేర్లకు కేటాయిస్తారు. మిడ్ క్యాప్ షేర్లకు 30- 50 శాతం నిధులు కేటాయించే అవకాశం ఉంది. స్మాల్ క్యాప్ షేర్లకు 20 శాతం వరకూ నిధులు కేటాయించే వీలుంది. ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లు ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్లకే పరిమితం అవుతున్నాయి. అదే కోవలో ఈ ఫండ్ కూడా లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. పెట్టుబడికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటేనే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల వైపు మొగ్గుచూపుతుందని తెలుస్తోంది. ‘ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ 20 ఈక్విటీ ఫండ్’ కు తాహెర్ బాద్షా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఈ ఫండ్ పనితీరును ఎస్అండ్పీ బీఎస్ఈ 500 టీఆర్ఐ పనితీరుతో పోల్చి చూస్తారు. ఫోకస్డ్ ఫండ్ కాబట్టి, దీర్ఘకాలిక మదుపరులకు ఈ పధకం అనువుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషణ.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
