close

తాజా వార్తలు

Published : 29/10/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాకు మధుమేహం వస్తుందా?

నాకు 50 ఏళ్లు. నేను రక్తపరీక్ష చేయించుకుంటే మధుమేహానికి దగ్గరగా ఉన్నట్లు తేలింది. అలాగే అధికబరువుతో బాధపడుతున్నా. నా ఒంట్లో చక్కెర సాధారణ స్థాయికి రావడానికి,  బరువు తగ్గడానికి మార్గం చెప్పండి.

- కె.విజయ, గుడివాడ

మీకు మధుమేహం వచ్చేసింది అని భావించొద్దు. వచ్చేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. బరువూ, మధుమేహం ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవే. బరువెక్కువుంటే శరీరంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. మీ విషయంలో అధిక బరువును నియంత్రించుకోగలిగితే మిగతావన్నీ సాధారణస్థితికి వస్తాయి. ఆహారం, విహారం అత్యంత ముఖ్యం. ఆ తరువాత కొన్ని తేలికపాటి ఔషధాలు కూడా తీసుకుంటే మీ సమస్య అదుపులోకి వస్తుంది.
నడకతో... ఆహారంలో అన్నం మోతాదు తగ్గించి, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. కాకర, దొండ, గోరుచిక్కుడు, మెంతికూర వీటిల్లో ఏదో ఒకటి ప్రతిరోజూ ఆహారంలో భాగమవ్వాలి. భోజన సమయంలో ఇంకా కొంచెం తినగలను అని అనిపించినప్పుడే తినడం ఆపేయాలి. మధ్యాహ్నం భోజనానికి ముందు కనీసం పావుగంట నడవడం మంచిది. అలాగే రాత్రి ఏడుగంటలకే అన్నం తిని పది నిమిషాలపాటు నిదానంగా నడవాలి. రోజూ శరీరానికి కనీసం 45 నిమిషాల నడక తప్పనిసరి.
సూచనలు... రాత్రిపూట చెంచా మెంతుల్ని మజ్జిగలో నానబెట్టి పరగడుపున తాగాలి. గోరువెచ్చని నీళ్లలో అరచెంచా చొప్పున ఉసిరి చూర్ణం, పసుపు కలిపి తీసుకోవాలి. దీన్ని రోజూ రెండు పూటలా భోజనం చేయడానికి పది నిమిషాలు ముందు తాగాలి. అలాగే చెంచా త్రిఫలచూర్ణాన్ని అరకప్పు గోరువెచ్చని నీళ్లలో కలిపి రాత్రి తాగినా మంచిదే. ఈ సూచనలన్నీ శ్రద్ధగా పాటిస్తే మధుమేహం దరిచేరకుండా ఉంటుంది. బరువూ అదుపులోకి వస్తుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని