
తాజా వార్తలు
‘మీట్’బ్యాక్‌గ్రౌండ్ మీదే!
ఆఫీస్ పనుల నిమిత్తం.. ఆన్లైన్ చదువుల కోసం.. ఇంటి నుంచే కాన్ఫెరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నాం. అందుకు గూగుల్ ప్రవేశపెట్టిన మీట్ ప్రత్యేకం. మీట్లో మీటింగ్‌లు, క్లాస్‌లు అటెండ్ అవుతున్నవారు ఇకపై బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. జూమ్‌లో కొన్ని నెలల ముందే ప్రవేశపెట్టిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు గూగుల్ మీట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. డీఫాల్ట్‌గా అందుబాటులో ఉన్న బ్యాక్గ్రౌండ్లను మాత్రమే కాకుండా మీరు తీసుకున్న ఇమేజ్‌లను కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరేదైనా ఆఫీస్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొంటున్నట్లయితే ఆఫీస్ డెస్క్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా బ్యాక్‌గ్రౌండ్‌ని పెట్టుకోవచ్చు. ఒకవేళ కస్టమ్ బ్యాక్గ్రౌండ్లను సెట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ‘బ్లర్’ ఆప్షన్ సైతం ఉంది. డెస్క్‌టాప్, యాపిల్ మ్యాక్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని వాడుతున్న యూజర్లు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. క్రోమ్ ఓఎస్‌లోనూ ఆప్షన్ని యాక్సెస్ చేయొచ్చు. ‘ఛేంజ్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్’పై క్లిక్ చేసి నచ్చిన ఇమేజ్‌లను ఎంచుకోవచ్చు.