close

తాజా వార్తలు

Published : 04/01/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడేళ్లకే తెల్లవెంట్రుకలా..!

మా బాబుకు మూడేళ్లు. అప్పుడే కొన్ని తెల్ల వెంట్రుకలు వచ్చాయి. ఇంత చిన్న వయసులోనే ఇలా రావడం ఏమిటి? మొత్తం జుట్టు తెల్లగా అవుతుందేమోనని భయంగా ఉంది.

- ఓ సోదరి

కొంతమంది పిల్లలకు జన్యుపరమైన సమస్యల వల్ల పుట్టుకతోనే తెల్ల వెంట్రుకలు ఉంటాయి. సాధారణంగా పోషకాహార లోపంతో పిల్లలకు తెల్ల వెంట్రుకలు వస్తాయి. జంక్‌ఫుడ్‌, స్వీట్లు, చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, కూల్‌డ్రింక్‌లు తాగినా ఇలా అవుతుంది.
ఆహారం: విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే పచ్చని కూరగాయలు, పసుపురంగులోని పండ్లను పిల్లలు ఎక్కువగా తినేలా చూడాలి. అలాగే పెరుగు, ఆకుకూరలు, టొమాటోలు, కాలీఫ్లవర్‌, అరటిపండు తినిపించాలి. ఇనుము, జింక్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు.. చికెన్‌, మటన్‌, గుడ్డు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సముద్రపు ఆహారంలో ఇవన్నీ ఉంటాయి. పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉండే ఆహారం ఇవ్వాలి.
చికిత్స: కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు రాయాలి. కొబ్బరినూనెలో ఉసిరి, మెంతిపొడి కలిపి వేడిచేసి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయించాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయాలి. నువ్వులనూనె, మెంతిపొడిలో క్యారెట్‌ రసం కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయించినా మంచిదే.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని