close
Array ( ) 1

తాజా వార్తలు

ఇంటి అందానికి... ఆంథూరియం

బృందావనం

పెద్దపెద్ద ఆకులతో, రంగురంగుల పూలతో  కనిపించే మొక్క ఆంథూరియం. ఇది ఇంటికి అందాన్ని తేవడమే కాదు... గాల్లోని అమ్మోనియా, ఫార్మాల్డీహైడ్‌, టోలిన్‌, క్లైలిన్‌ వంటి విష రసాయనాలను పీల్చుకుంటుంది. మరి ఈ మొక్కను ఎలా పెంచుకోవాలో చూద్దామా...

గాలిని స్వచ్ఛంగా మార్చడం ఈ మొక్క ప్రత్యేకత. ఆకులు హృదయాకృతిలో కనువిందు చేస్తే... పూలు పలు వర్ణాల్లో ఏడాది పొడవునా పూస్తాయి. పొడవైన కాడలతో, ఎరుపు, తెలుపు వర్ణాల్లో చిన్న పూలతో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కను కణజాలవర్ధనం, మైక్రా కట్టింగ్స్‌ ద్వారా పెంచుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో పెంచుకోవాలంటే బజారులో దొరికే ప్లగ్‌ ట్రేలు వాడాలి. చిన్న ట్రేలలో ముందుగా పెంచి, ఆ తరువాత పెద్ద కుండీల్లోకి మార్చాలి. ఇలా మార్చేటప్పుడు ఆ మొక్కలను విడదీయకుండా నిలువుగా నాటాలి. మరీ లోతుగా నాటకూడదు. అలాగని పైకి నాటితే ఊతం సరిపోక కింద పడిపోతాయి. గాలి చొరబడేందుకు వీలుగా మట్టిని వదులుగా చేసుకోవాలి.   కుండీల పరిమాణాన్ని బట్టి ఇరవై శాతం దూరం వదిలి, మరో కుండీని ఉంచాలి. దీన్ని పెంచేందుకు కొబ్బరి పీచు, పీట్‌ మాస్‌తోపాటు పెర్లైట్‌ అవసరం. 50 శాతం ఘన పదార్థాలు, 25 శాతం చొప్పున నీరు, గాలి కచ్చితంగా అందేలా చూసుకోవాలి. తాజా కొబ్బరి పీచు వాడాలి. మొక్కల్ని బట్టి కుండీలను ఎంచుకోవాలి.

నీరివ్వండి ఇలా...
మొక్క మొదలు దగ్గర నీటిని పోయాలి. దీనివల్ల ఆకులపై దుమ్ము పేరుకుపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నాలుగు నుంచి ఆరు వారాలకోసారి కచ్చితంగా పై నుంచి నీటిని పోయాలి. చదరపు మీటరుకు అయిదు నుంచి పన్నెండు లీటర్ల నీటిని అందించాలి. సోడియం, క్లోరిన్‌ లేని నీటిని వాడాలి. లేదంటే ఆకులు చిట్లి పోతాయి. ఇది మరీ తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. మొక్క పెరుగుదలకు 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అనుకూలం. ఈ మొక్క నీడలో పెరిగినా కొంత వెలుతురు అవసరమే. మరీ ఎక్కువ వెలుతురు ఉంటే ఆకులు, పూలు రంగును కోల్పోయి, మాడిపోతాయి. అతి తక్కువ కాంతి అందినా మొక్కలు వంగిపోతాయి. వాటి బరువూ, పూల దిగుబడీ తగ్గిపోతుంది. ఆంథూరియంను చీడపీడలు ఎక్కువగానే ఆశిస్తాయి. ప్రధానంగా తామర, నులిపురుగులు, పేనుబంక, నల్లి, నత్తలు, తెల్లదోమ వస్తాయి. వృక్ష సంబంధ పురుగు మందులు, వేప నూనె పిచికారి చేయాలి. తెగుళ్లను తట్టుకునే నాణ్యమైన మొక్కలు ఎంచుకోవాలి. ఆంథూరియం ఆకులు, పూలపై పురుగు మందుల ప్రభావం ఎక్కువ.  కాబట్టి సహజంగా లభించే పర్యావరణహిత మందులు, హెర్బల్‌ ఉత్పత్తులు వాడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.