close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 23/01/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ కళ్లలో కాంతి రేఖలు

నల్లటి వలయాలకు చెక్‌

కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటే.. చందమామలాంటి చక్కని ముఖం కూడా చిన్నబోతుంది. సరిపడినంత నిద్ర లేకపోవడం, అలసట, ఒత్తిడి... ఇవన్నీ వలయాలు ఏర్పడటానికి కారణమే. ఇవి అందరికీ తెలిసిన కారణాలే. అయితే మనకు తెలియని అతి ముఖ్యమైన కారణం పోషకాహార లోపమే అంటున్నారు నిపుణులు.

ఇనుము: నల్లటి వలయాలతోపాటుగా స్తబ్ధుగా ఉండి, నీరసంగా అనిపిస్తుంటే శరీరంలో తగినంత ఇనుము లేదనే అర్థం. దీని వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో చర్మం పాలిపోతుంది. దాంతో నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

ఎందులో ఎక్కువ: పచ్చని కాయగూరలు, గుమ్మడి గింజలు, పప్పులు, బీన్స్‌.

విటమిన్‌ సి: చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలో దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా చర్మం పూర్వపు మెరుపును సంతరించుకుంటుంది.

ఎందులో ఎక్కువ: జామ, స్ట్రాబెర్రీ, నిమ్మజాతి పండ్లు, కాలీఫ్లవర్‌.

విటమిన్‌ కె: జీవం కోల్పోయిన చర్మాన్ని మెరిసేట్టు చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. చర్మ సమతౌల్యాన్ని కాపాడుతుంది. రోజూ విటమిన్‌ కె తీసుకోవడం వల్ల నల్లటి వలయాలు త్వరగా చర్మంలో కలిసిపోతాయి.

ఎందులో ఎక్కువ: దానిమ్మ, కాలీఫ్లవర్‌, టమాటా.

విటమిన్‌ ఇ: చర్మం, జుట్టు సంరక్షణకు అవసరమైన అతి ముఖ్యమైన విటమిన్‌ ఇది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. చర్మం పొడిబారిపోకుండా చేస్తుంది. పిగ్మెంటేషన్‌ నుంచి కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది.

ఎందులో ఎక్కువ: పొద్దుతిరుగుడుపువ్వు నూనె, మొక్కజొన్న, బచ్చలి, బాదంపప్ఫు

లైకోపిన్‌: వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో ఉండే రసాయనం ఇది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువ. కంటి చూపును, వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మంగు మచ్చలతోపాటు నల్లటి వలయాలనూ తగ్గిస్తుంది.

ఎందులో ఎక్కువ: టమాటా, పుచ్చకాయ, క్యాబేజీ, బొప్పాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.