అలాంటి వ్యక్తిని ప్రేమించకండి!
close

తాజా వార్తలు

Updated : 04/03/2020 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి వ్యక్తిని ప్రేమించకండి!

ఒక్కోసారి ప్రేమావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం చేదు అనుభవాలనే మిగులుస్తాయి అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన మనసులోని మాటను వెల్లడించింది బాలీవుడ్‌ నటి నీనాగుప్తా. ‘పెళ్లైనవారితో ప్రేమలో పడకండి. అలాచేసి నేనెంతో బాధపడ్డాను. పెళ్లైన వ్యక్తిని ప్రేమించి, ఆ తర్వాత భార్యకు విడాకులు ఇవ్వమంటే అతడు ఒప్పుకోడు. దీనివల్ల ఇరు కుటుంబాల్లోనూ కలతలు వస్తాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే పెళ్లైన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించకపోవడమే మంచిది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పుకొచ్చింది. ఎనభయ్యో దశకంలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ రిచర్డ్స్‌తో ప్రేమలో పడ్డ నీనా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే పెళ్లైన రిచర్డ్స్‌తో సంతానాన్ని పొందడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. అన్నట్టు నీనా ‘బధాయ్‌హో’ సినిమాలో మలి వయసులో గర్భవతైన ఇల్లాలిగా మెప్పించి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని