పీఎం-కేర్స్‌ విరాళ వివరాలు ఫారం 16లోనే!
close

తాజా వార్తలు

Published : 11/04/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎం-కేర్స్‌ విరాళ వివరాలు ఫారం 16లోనే!

దిల్లీ: కరోనా వైరస్‌ పోరులో భాగంగా పీఎం కేర్స్‌ సహాయనిధికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలా తమ యాజమాన్యం ద్వారా ఉద్యోగులు ఇచ్చే విరాళాలకు ప్రత్యేకంగా ఎలాంటి ధృవపత్రాన్ని జారీచేయమని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ పేర్కొంది. అయితే యాజమాన్యం ఉద్యోగులకు సంవత్సరం చివరలో ఇచ్చే ఫారం-16లో విరాళం ఇచ్చిన మొత్తాన్ని చూపిస్తాయని తెలిపింది. ఆ టీడీఎస్‌ పత్రాన్నే విరాళం ఇచ్చిన దానికి రుజువుగా పరిగణిస్తామని పేర్కొంది. చాలా మంది ఉద్యోగులు తమ వేతనాల నుంచి విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) స్పష్టతనిచ్చింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని